Youtube: షాకింగ్ న్యూస్.. యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు

by Prasanna |   ( Updated:2025-03-08 15:29:29.0  )
Youtube: షాకింగ్ న్యూస్.. యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు
X

దిశ, వెబ్ డెస్క్ : యూట్యూబ్ లో ( Youtube ) ఉపయోగపడే కంటెంట్ కంటే .. చెత్త కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇటీవలే ఫేక్ ఎక్కువగా నడుస్తుంది. తెలిసింది కొంచమైతే .. దానికి లేని పోనిది యాడ్ చేసి ఎవరికీ నచ్చింది వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు, ఇదే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే, ఎంతో మంది యూట్యూబ్ మీద కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు వీటిని యూట్యూబ్ పట్టించుకోలేదు. కానీ, రోజు రోజుకి ఫిర్యాదులు ఎక్కువైపోవడంతో ఇప్పుడు రూల్స్ ను కఠినంగా మార్చింది. అనవసరమైన కంటెంట్ ను గుర్తించి తొలగిస్తోంది.

90 రోజుల్లో ఇప్పటికి 95లక్షల వీడియోలు ( videos ) , 45లక్షల ఛానెళ్లను (channels ) తొలగించింది. ముఖ్యంగా, మన దేశంలోనే తొలగింపులు అత్యధిక జరిగాయి. దాదాపు 30 లక్షల భారతదేశపు వీడియోలను యూట్యూబ్ తొలగించింది. ఈ హానికరమైన కంటెంట్ ను తీసివేయడానికి యూట్యూబ్ AI ను ఉపయోగిస్తుంది. చెత్త వీడియోలనే ఎక్కువ మంది చూస్తున్నట్లు గుర్తించారు. వీటిలో అనవసరమైన కంటెంట్, వేధింపులు, స్పామ్, తప్పుడు సమాచారంతో

పక్కదారి పట్టించే వీడియోలు తొలగించింది. 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 95 లక్షలు వీడియోలు యూట్యూబ్ తీసి వేసింది. పిల్లల భద్రతే ముఖ్యమని భావించి వాటికి సంబంధించిన 50లక్షల వీడియోలను తొలగించింది. కేవలం వీడియోలతోనే ఆపకుండా.. 45లక్షల ఛానెళ్లను కూడా డస్ట్ బిన్ లో పడేసింది. అంతటితో ఆగకుండా వీడియోల కింద ఉన్న మొత్తం 1కోటి2లక్షల కామెంట్లను కూడా డిలీట్ చేసింది. కాబట్టి, వీడియోస్ అప్లోడ్ చేసే ముందు అన్ని చెక్ చేసుకుని యూట్యూబ్ లో వేయాలని సూచించింది.


Read More ....

Phone లో నంబర్స్ పై నుండి కిందకి ఉంటే..! calculator , Computer లో కింద నుండి పైకి ఉంటాయి.. ఎందుకో తెలుసా..?


Next Story