YouTube Sleep timer: YouTubeలో అదిరిపోయే ఫీచర్.. ‘స్లీప్ టైమర్‌’‌ ఆప్షన్

by Harish |
YouTube Sleep timer: YouTubeలో అదిరిపోయే ఫీచర్.. ‘స్లీప్ టైమర్‌’‌ ఆప్షన్
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ YouTubeలో అదిరిపోయే ఫీచర్ రాబోతుంది. వీడియో చూస్తున్న సమయంలో నిద్ర పోయినప్పుడు కాసేపటి తర్వాత వీడియో దానికదే ఆగిపోయేలా ‘స్లీప్ టైమర్’ ఆప్షన్‌ను తెస్తున్నారు. ప్రస్తుతానికి దీనిని టెస్టింగ్ చేస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు య్యూటూబ్‌ వీడియోలో స్లీప్ టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. దీంతో వీడియో చూస్తున్న సమయంలో ఒక వేళ ఆ వీడియోను పాజ్ చేయకుండా అలాగే నిద్రపోతే ముందుగా సెట్ చేసిన నిర్దిష్ట టైంకు వీడియో ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. దీని వలన డేటా వాడకం ఆగిపోవడంతో పాటు, వీడియో రన్ కాకుండా ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. టైమర్ సెట్టింగ్‌లో 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 60 నిమిషాల ప్లేబ్యాక్‌ పాజ్‌ను అందించారు.

ఈ ఫీచర్ ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, టెస్టింగ్‌లు అన్ని పూర్తయ్యాక మిగతా యూజర్లకు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ఉపయోగించడం చాలా సులువు అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో లేదా డెస్క్‌టాప్‌ వెబ్ క్లయింట్‌లో YouTube యాప్‌ను తెరిచి, వీడియోను ప్లే చేస్తున్నప్పుడు సెట్టింగ్‌ల మెనుకి వెళ్లి టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌కు యాక్సెస్ పొందాలంటే యాప్‌లో సైన్ ఇన్ అయి ఉండాలి.

Advertisement

Next Story

Most Viewed