- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన శాంసంగ్
దిశ, టెక్నాలజీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ శాంసంగ్ ఎం సిరీస్‌లో కొత్త మొబైళ్లను విడుదల చేసింది. గెలాక్సీ ఎం 55 5జీని సోమవారం కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటితో పాటు తక్కువ ధరకే 5జీ ఫోన్ కొనాలని భావించే వారికి సరసమైన బడ్జెట్‌లో ఎం15 5జీని తీసుకొచ్చింది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ద్వారా తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 26,999 ధరకు ఎం55 8జీబీ+128 జీబీ వేరియంట్, రూ. 32,999 ధరకే 8జీబీ+256 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. సోమవారం నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్‌యూఐ 6.1తో వచ్చింది. నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్‌తో పాటు ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌కు 45 ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఇక, బడ్జెట్ ధరలో 5జీ నెట్‌వర్క్‌తో కూడిన ఫోన్‌ను అందించాలనే లక్ష్యంతో తెచ్చిన ఎం15 5జీ స్మార్ట్‌ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ ఫోన్ రూ. 12,999 ధరకే లభిస్తుంది.