- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొబైల్ తో కొడుకుకి వచ్చిన క్యాన్సర్ ని కనుగొన్న తల్లి..
దిశ, ఫీచర్స్ : క్యాన్సర్ పేరు వినగానే ఒక్కసారిగా కంగారు మొదలవుతుంది. అయితే దాన్ని సకాలంలో గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని కూడా సులువుగా నయం చేయవచ్చు. స్మార్ట్ వాచ్ వల్ల ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిందనే విషయం కనుగొన్నారనే వార్త చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగు చూసింది. మొబైల్ కారణంగా ఒక తల్లి తన 3 నెలల చిన్నారికి కంటి క్యాన్సర్ వచ్చిందని గుర్తించిందట. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీడియా కథనాల ప్రకారం ఇంగ్లాండ్‌లోని మెడ్‌వే నగరంలో నివసిస్తున్న ఒక మహిళ ఎప్పటిలాగే సాయంత్రం భోజనం వండుతోంది. అప్పుడు ఆమె దృష్టి తన 3 నెలల కొడుకు వైపు మళ్ళింది. ఆ చిన్నారి పేరు థామస్. అయితే తెల్లని రంగులో మెరుస్తున్న ఆ చిన్నారి కళ్లలో ఏదో తేడాను గమనించింది ఆ తల్లి. ఆ తర్వాత ఆమె తన స్మార్ట్‌ఫోన్‌ని తీసుకొని ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించింది. ఆ తర్వాత కొన్ని ఫొటోలు కూడా క్లిక్ చేసి. అంతే కాదు అసలు చిన్నారికి ఇలా ఎందుకు జరిగింది అనే విషయం గురించి మరింత తెలుసుకోవాలనుకుంది. వెంటనే ఇంటర్నెట్ సహాయంతో చిన్నారికి వచ్చింది కంటి క్యాన్సర్ ప్రాథమిక దశ అని తెలుసుకుంది. ఇంటర్నెట్‌లో దాని గురించి సమాచారం అందుకున్న వెంటనే మహిళకు ఇది అరుదైన క్యాన్సర్ అని తెలిసింది. ఆ తర్వాత ఆమె దాని గురించి సమీప వైద్యుడిని సంప్రదించి వెంటనే చిన్నారిని మెడ్‌వే ఆస్పత్రికి తరలించారు.
చికిత్స తర్వాత చిన్నారి పూర్తిగా సురక్షితం..
మెడ్వే ఆసుపత్రిలో చిన్నారికి సకాలంలో చికిత్స ప్రారంభించారు. వైద్యుల సమాచారం ప్రకారం ఈ కంటి క్యాన్సర్ అరుదుగా వస్తుందని, వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. అనేక రౌండ్ల కీమోథెరపీ తర్వాత, పిల్లల కంటి క్యాన్సర్ పూర్తిగా నయమైందని తెలిపారు. అతని తల్లి ప్రారంభ దశలో క్యాన్సర్ కనుగొన్నదని వైద్యులు తెలిపారు.