Meta AI: హిందీతో సహా ఏడు కొత్త భాషల్లో అందుబాటులోకి వచ్చిన Meta AI

by Harish |
Meta AI: హిందీతో సహా ఏడు కొత్త భాషల్లో అందుబాటులోకి వచ్చిన Meta AI
X

దిశ, టెక్నాలజీ: మార్క్ జూకర్ బర్గ్ ఆధ్వర్యంలోని మెటా ఏఐ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్‌లతో వస్తుంది.తాజాగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి దీనిలో కొత్తగా ఏడు భాషలను అందించారు. WhatsApp, Instagram, Messenger, Facebookలో ఇప్పటికే మెటా ఏఐ అందుబాటులో ఉండగా, ఇకమీదట కొత్తగా ఏడు భాషల ద్వారా దీనిని వాడుకోవచ్చు. వినియోగదారులు హిందీ, హిందీ రోమనైజ్డ్ స్క్రిప్ట్ (హింగ్లీష్), ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్‌ భాషల్లో సంభాషించవచ్చు. మెటా గత నెలలో దేశీయ యూజర్ల కోసం WhatsApp, Facebookలో AI చాట్‌బాట్‌కు యాక్సెస్‌ను తీసుకువచ్చింది. హిందీని కూడా కొత్త అప్‌డేట్‌లో ఇవ్వడం ద్వారా భారతీయ యూజర్లకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

కంపెనీ మెటా AI అసిస్టెంట్ సామర్థ్యాలను విస్తరించాలని చూస్తుంది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో మరిన్ని భాషలను కొత్తగా యాడ్ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మెటా ఏఐ 22 దేశాలలో అందుబాటులో ఉంది, కొత్తగా అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ, కామెరూన్‌లలో అందుబాటులోకి వచ్చింది. ప్రశ్నలకు సమాధానాలు, ఆలోచనలు స్వయంచాలకంగా అందిస్తూ యూజర్ల పనిని మరింత సులభం చేసే ఆప్షన్లను అందివ్వటానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మెటా యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.



Next Story