- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
iQOO: అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఇవే ఫీచర్స్
దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ iQOO ఇండియాలో కొత్త మోడల్స్‌ను విడుదల చేసింది. అవి ‘iQOO Z9s ప్రో 5G, Z9s 5G’. ఈ రెండు Qualcomm, MediaTek ప్రాసెసర్ ద్వారా పనిచేస్తాయి. మెరుగైన డిస్‌ప్లే కోసం AMOLED స్క్రీన్‌లను అందించారు. iQOO Z9s ప్రో 5G బేస్ మోడల్ 8GB RAM+128GB ధర రూ.24,999. 8GB+256GB ధర రూ.26,999,12GB RAM +256GB ధర రూ.28,999. ఇది ఆగస్టు 23 నుండి అమ్మకానికి ఉంటుంది.
మరో మోడల్ iQOO Z9s 5G బేస్ వేరియంట్ 8GB RAM+128GB ధర రూ.19,999, 8GB RAM+256GB ధర రూ. 21,999. 12GB RAM+256GB ధర రూ.23,999. ఇది ఆగస్టు 29 నుంచి లభిస్తుంది. కొనుగోలు సమయంలో బ్యాంక్ తగ్గింపులు కూడా ఉంటాయి.
ఈ రెండు వేరియంట్లు 6.77-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,392 పిక్సెల్‌లు) AMOLED స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. రిఫ్రెష్ రేట్ 120Hz. ఇవి ఆండ్రాయిడ్ 14-ఆధారిత Funtouch OS 14లో రన్ అవుతాయి. iQOO రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వచ్చాయి. Z9s ప్రో 5Gలో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ , Z9s 5Gలో 2MP బ్యాక్ కెమెరాలు కూడా ఉన్నాయి.
Z9s ప్రో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. అదే Z9s MediaTek డైమెన్సిటీ 7300 SoCపై పనిచేస్తుంది. రెండు ఫోన్లు 5,500mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. Z9s ప్రో కు వేగవంతమైన 80W చార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. Z9s కు 44W చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు.