iPhone 17: ఇతర మోడళ్ల కన్న భిన్నంగా ఐఫోన్ 17.. కెమెరాలో బిగ్ ఛేంజ్!

by D.Reddy |
iPhone 17: ఇతర మోడళ్ల కన్న భిన్నంగా ఐఫోన్ 17.. కెమెరాలో బిగ్ ఛేంజ్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple company).. త్వరలోనే ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్‌ను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఐఫోన్ 17, 17ప్రో, మ్యాక్స్‌ పేర్లతో మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీక్ (Features, Specifications are leaked) అయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌లో ఈసారి కెమెరా మాడ్యూల్‌లో పెద్ద మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త కెమెరా మాడ్యూల్, బిల్డ్‌తో ఈ సిరీస్‌ను తీసుకురావడానికి యాపిల్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డిజైన్‌ అప్‌గ్రేడ్‌తో పాటు ఎక్స్‌క్లూజివ్‌గా డిస్‌ప్లేను మెరుగుపరుస్తున్నారని సమాచారం. హైటాంగ్ ఇంటర్నేషనల్ టెక్ రీసెర్చ్ విశ్లేషకుడు మజిన్ బు తెలిపిన వివరాల ప్రకారం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో మోడళ్లలో డైనమిక్ ఐస్‌లాండ్‌ ఇంతకు ముందున్న ఐఫోన్లకు ఉన్నదాని కంటే చిన్నగా ఉండనుంది. ఇది ఫ్రంట్‌ కెమెరా, ఫేస్ ఐడీ సెన్సార్లతో ఉంటుంది. అయితే, దీనిని కొత్తమంది టెక్ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.

అయితే యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ డిస్‌ ప్లేకు కొత్త మెటలెన్స్ టెక్నాలజీని అనుసంధానించడానికి ప్రయత్నాలు చేస్తోందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో కంపెనీ సఫలమైతే డైనమిక్ ఐస్‌లాండ్‌ సైజుని తగ్గించడానికి వీలు అవుతుంది. ఈ టెక్నాలజీని అన్ని ఐఫోన్ 17 మోడళ్లలో వాడతారని ముందుగా అందరూ భావించారు. అయితే, ఈ డిస్‌ప్లే అప్‌గ్రేడ్ కేవలం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌కు మాత్రమే రావచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ గ్లాస్, అల్యూమినియం బిల్డ్‌తో పాటు కొత్త కెమెరా మాడ్యూల్‌తో న్యూ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే చాలా సార్లు యాపిల్ కెమెరా అప్‌గ్రేడ్లను ప్రత్యేకంగా ప్రో మాక్స్‌లోనే ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్రస్తుతం వచ్చిన లీక్‌ నిజమైతే ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్లకు కాస్త భిన్నంగా కనపడుతుంది.

Next Story

Most Viewed