- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చైనా.. ఇక కాస్కో.. స్మార్ట్ ఫోన్ల తయారీలో ఇండియానే కింగ్ తమ్ముడు.. ఈ లెక్కలు చూడండి

దిశ,వెబ్‌డెస్క్: Smartphone Market: సాధారణంగా ప్రపంచ స్మార్ట్ ఫోన్(smartphone) మార్కెట్లో ఎప్పుడూ చైనా(China) కంపెనీలదే హవా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను చైనా కంపెనీలు ఏలుతున్నాయి. షియోమీ,రియల్ మీ, ఒప్పో, వివో , వన్ ప్లస్ ఇలా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ డ్రాగన్ కంట్రికి చెందినవే. అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రికి బిగ్ షాకిచ్చింది భారత్. స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి రంగంలో భారత్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.
మనదేశంలో ఉత్పత్తి అయిన స్మార్ట్ ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేస్తూ రికార్డు క్రియేట్ చేస్తోంది. 2025 ఆర్ధిక ఏడాదిలో 20 బిలియన్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 2024లో దేశం నుంచి 15 బిలియన్ డాలర్ల స్మార్ట్ ఫోన్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. వాటిలో యాపిల్ కంపెనీ(apple iphones) ఫోన్ల వాటా 10 బిలియన్ డాలర్ల వరకు ఉంది. ఈ సంఖ్య ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనిలో భాగంగానే దేశంలో ఉత్పత్తి, ఎగుమతులు, ఉద్యోగ కల్పన కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI)స్కీం అమలు అవుతోంది. ఈ స్కీమ్ ఉద్దేశ్యం ఏంటంటే దేశంలో తయారీ రంగాన్ని మరింత ముందుకు సాగించడం. ఈ స్కీమ్ కిందే యాపిల్ ఐఫోన్ల(apple iphones) ఉత్పత్తి కూడా జరుగుతోంది. అయితే ఈ స్కీం అద్బుత ఫలితాలను ఇస్తోంది. 2024లో దాదాపు లక్ష కోట్లకు చేరుకుంది.
ఈ స్కీం ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశంలో తయారీ రంగంలో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పన కూడా జరుగుతోంది. గతంలో 2014-15లో దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 5.8కోట్లు ఉండేది. ఇప్పుడు ఈ సంఖ్య 33కోట్లకు చేరింది. దిగుమతులు గణనీయంగా తగ్గి..ఎగుమతులు దాదాపు 5కోట్లకు చేరుకున్నాయి. ఈ గణాంకాలే పీఎల్ఐ స్కీం వల్ల కలిగిన బెనిఫిట్స్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు.
అయితే దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు సైతం చెబుతున్నారు. దీనిలో 2027 నాటికి 12 మిలియన్ల ఉద్యోగాలు కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రత్యేక్షంగా 3 మిలియన్లు, పరోక్షంగా 9మిలియన్ల ఉద్యోగాలు ఉండనున్నాయి. ప్రత్యేక్ష ఉద్యోగాల్లో 1 మిలియన్ ఇంజనీర్లు, 2 మిలియన్ల ఐటీఐ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్, 0.2 మిలియన్ల AI, ఎంఎల్, డేటా సైన్స్ రంగాల నిపుణులకు అవకాశాలు లభించనున్నాయి. వీటితోపాటు మరో 9 మిలియన్ల నాన్ టెక్నికల్ ఉద్యోగాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా భవిష్యత్తులో ఎక్కువ మందికి ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పకనే చెబుతున్నాయి.
రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ మరింత దూకుడుగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిశ్రమకు 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఉత్పత్తిని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ టార్గెట్ రీచ్ అయ్యేందుకు కార్యచరణ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోంటోంది. రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 5 రెట్లు డెవలప్ మెంట్ సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంతేకాదు 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తి అంతరాన్నితగ్గించడంతోపాటు..దేశంలో ఉత్పత్తి కేవలం 101 బిలియన్ డాలర్లుగా ఉంది.
సాధారణంగా చైనా నుంచి ప్రపంచ దేశాలకు స్మార్ట్ ఫోన్లు(smartphone) ఎగుమతి అవుతుంటాయి. కానీ ఇప్పుడు మన దేశం నుంచి ప్రపంచదేశాలకు ఎగుమతులు కానున్నాయి. దీంతో డ్రాగన్ కంట్రీకి భారత్ కోలుకోలేని షాక్ ఇవ్వడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే దూసుకుపోతోంది. ప్రముఖ కంపెనీలన్నీ కూడా భారత్ కే ప్రాధ్యాన్యత ఇవ్వడం చైనాకు షాకిచ్చినట్లవుతుంది. చైనా మార్కెట్ కాస్త భారత్ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పుడు ఉత్పత్తి రంగంలో మేడిన్ భారత్(Made in india) అనే స్థాయికి చేరుకోనుంది. కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకువచ్చిన పీఎల్ఐ స్కీముతో ఇది సాధ్యమవుతుందని ఆర్థికవేత్తలు సైతం చెబుతున్నారు.