- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ ఇంట్లో ఏసీ ఉందా.. అయితే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తోంది..
దిశ, వెబ్‌డెస్క్: జూన్ నెల వచ్చినప్పటికీ ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. సూర్యుడి వేడికి తట్టుకోలేక ప్రతీ ఒక్కరు ఇంట్లో ఏసీలు పెట్టించుకుంటున్నారు. దీంతో కరెంట్ బిల్ కూడా కొండెంకి కూర్చుంటుంది. ఏసీ వాడుతున్నప్పటికీ మీ కరెంట్ బిల్ తక్కువ రావాలి అనుకుంటున్నారా. అయితే.. మీరు వాడుతున్న ఏసీలో ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్నట్లయితే కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది.
ఇప్పటికే మీరు ఏసీలు కొనె ఉంటారు. మీ ఏసీలో ఇన్వర్టర్ టెక్నాలజీ ఉందో లెదో మీకు తెలిసిఉండదు. నాన్-ఇన్వర్టర్ ఏసీలతో పోలిస్తే, ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీలు కరెంట్‌ను చాలా ఆదా చేస్తాయి. కాబట్టి.. మీరు వాడుతున్న ACలో ఇన్వర్టర్ టెక్నాలజీ ఉందో లేదో పరిశీలించండి. అది ఉన్నట్లయితే మీ కరెంట్ బిల్ చాలా తక్కువగా వస్తుంది. ఇంతకి ఇన్వర్టర్ ఏసీ విద్యుత్తును ఎలా ఆదా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని ACలు కంప్రెసర్ నిర్ణీత వేగంతో నడుస్తాయి. అంటే సెట్ ఉష్ణోగ్రతను చేరుకోవడానికి ఇది ఆఫ్ లేదా ఆన్‌లో ఉంది. అయితే ఇన్వర్టర్ AC వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ని కలిగి ఉంటుంది. దీంతో అది చల్లదానికి అనుగుణంగా దాని వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. పరిసర పరిస్థితులు, శీతలీకరణ అవసరాలకు అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ఇన్వర్టర్ ACలు చల్లదన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అప్పుడు సెట్ ఉష్ణోగ్రత చేరుకున్న తర్వాత, కంప్రెసర్ వేగాన్ని తగ్గిస్తుంది. శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది.
అదేవిధంగా, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, కంప్రెసర్ వేగంగా నడుస్తుంది గదిని చల్లబరుస్తుంది. దీంతో కరెంట్ బిల్ సేవ్ అవుతోంది. అయితే.. నాన్-ఇన్వర్టర్ ఏసీలో, కంప్రెసర్ తరచుగా ఆన్ ఆఫ్ అవుతుంది. దీందో దీనికి చాలా విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది. అందుకే ఏసీ తీసుకున్నప్పుడు అది ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగి ఉందో లేదో చూసి తీసుకోండి. దీంతో మీ కరెంట్ బిల్ చాలా వరకు సేవ్ అవుతోంది.