- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్.. 15 గంటల బ్యాటరీ లైఫ్ !
దిశ, ఫీచర్స్ : ల్యాప్‌టాప్ ల విషయానికి వస్తే ప్రతిఒక్కరూ తక్కువ ధరలో మంచి ఫీచర్లు, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌తో వచ్చే వాటిని ఎంచుకుంటారు. క్రమంలోనే Asus రూ. 30,000లోపు ఉండే కొత్త ల్యాప్‌టాప్‌లని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే Asus Chromebook CM14. మంచి డిజైన్, 180 డిగ్రీల ఫ్లాట్ హింజ్, 14 అంగుళాల డిస్ప్లే , వై-ఫై 6 వంటి ఫీచర్లతో విడుదలైన ఈ Asus ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండనుంది.
Asus Chromebook CM14 ధర..
Asus కంపెనీ లాంట్ చేసిన ఈ ల్యాప్‌టాప్ గ్రావిటీ గ్రే కలర్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ క్రోమ్‌బుక్‌ను ఇ-కామర్స్ సైట్ అమెజాన్ నుండి రూ. 26,990కి కొనుగోలు చేయవచ్చు.
Asus Chromebook CM14 స్పెసిఫికేషన్‌లు..
18.3mm మందంతో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లో 14 - అంగుళాల LED బ్యాక్‌లిట్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ఉంది. ఈ ల్యాప్ టాప్ లో పూర్తి - HD ప్లస్ రిజల్యూషన్ (1,920 x 1,080 పిక్సెల్‌లు) ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 250 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంది. ఈ పరికరంలో Chrome OS ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించారు.
వేగం, మల్టీ టాస్కింగ్ కోసం, ఈ పరికరంలో MediaTek Kompanio 520 ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం ARM Mali G52 MC2 GPU ఉన్నాయి. ప్రాసెసర్ గరిష్ట పనితీరు 2.0 GHz వరకు ఉంటుంది.
ర్యామ్, స్టోరేజ్ గురించి చెప్పాలంటే, ఈ Chromebookలో 8 GB LPDDR4X RAM, 128 GB eMMC 5.1 స్టోరేజ్‌ని అందుబాటులో ఉంది. ఆడియో కోసం, కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌లో ఇన్‌బిల్ట్ స్పీకర్‌లను అందించింది. ఎవరైనా కస్టమర్ హెడ్‌ఫోన్స్ ధరించి సంగీతం వినాలనుకుంటే, దీని కోసం జాక్ కూడా అందుబాటులో ఉంది.
బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, 15 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ కోసం, ఈ పరికరంలో బ్లూటూత్ వెర్షన్ 5.3, Wi-Fi 6, ఒక USB 3.2 జనరేషన్ 1 టైప్-A పోర్ట్, రెండు USB 3.2 జనరేషన్ 1 టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి.
Asus laptop at lowest price