- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
WhatsApp అదిరిపోయే ఫీచర్: ఒకే నెంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్ వాడొచ్చు!
దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజామాన్యంలోని WhatsApp ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మళ్లీ మరోక అదిరిపోయే ఫీచర్‌ను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఫీచర్‌లో వినియోగదారులు వాట్సాప్‌ను ఒక్క ఫోన్‌లో మాత్రమే కాకుండా నాలుగు ఫోన్లలో వాడేలా సరికొత్త సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు అధికారిక కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
ఈ ఫీచర్ ద్వారా ఫోన్ డ్యామేజ్ లేదా బ్యాటరీ చార్జింగ్ అయిపోయిన సమయాల్లో ఇంకొ ఫోన్‌లో స్కానర్ ద్వారా లాగిన్ అయి వాట్సాప్ ఉపయోగించవచ్చు. గరిష్టంగా నాలుగు ఫోన్‌లను ఒకే వాట్సాప్ నంబర్‌తో లింక్ చేయవచ్చు. గతంలో ఈ ఫీచర్స్‌కు సంబంధించి పలు వార్తలు వచ్చినప్పటికి, కంపెనీ మొట్టమొదటి సారిగా దాని బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
మొదటి ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేసి స్కానర్ సహాయంతో వేరే స్మార్ట్ ఫోన్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా నాలుగు అదనపు స్మార్ట్‌ఫోన్‌లను ఇలా లింక్ చేయెచ్చు. కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, వినియోగదారులు ఎప్పటినుంచో ఈ ఫీచర్ కోసం ఎదరుచూస్తున్నారు. దీని ద్వారా మొదటి ఫోన్ పనిచేయని టైంలో సెకండరీ ఫోన్ ద్వారా ఇతరుతో తమ మెసేజ్‌లను తిరిగి పంపవచ్చు/పొందవచ్చు. ఫోటోలు, మీడియా ఫైల్స్‌ను కూడా యాక్సిస్ చేయవచ్చు.
సెకండరీ ఫోన్‌లో వాట్సాప్ లాగిన్ కొద్ది రోజుల(అంచనాల ప్రకారం, 14 రోజుల) వరకు ఉంటుంది. ఆ తరువాత అది ఆటోమెటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది. దీంతో వినియోగదారులు వేరే స్మార్ట్ ఫోన్‌లలో లాగ్ అవుట్ అవడం మర్చిపోయినా కూడా ఈ ఫీచర్‌తో అదే లాగ్ అవుట్ అయిపోతుంది.
కొత్త ఫీచర్ ద్వారా ఎప్పటిలాగే, మెసేజ్‌లు అన్ని కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేయబడతాయని కంపెనీ పేర్కొంది. రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుంది. ఇతర స్మార్ట్ ఫోన్‌లలో లాగిన్ కావడానికి QR కోడ్ స్కానర్‌తో పాటు, OTP ఆధారిత లాగిన్ సిస్టమ్‌ను కూడా తీసుకురావాలని కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.