- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీం ఇండియాతో ఆడటానికి శ్రీలంక జట్టు రెడీ
దిశ, స్పోర్ట్స్: కరోనా సంక్షోభం కారణంగా స్తంభించిపోయిన క్రికెట్‌ను తిరిగి ప్రారంభించాలని అన్ని దేశాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్తాన్ జూలైలో టెస్టు, టీ20 సిరీస్‌లు ఆడటానికి అవగాహనకు వచ్చాయి. అయితే, టీం ఇండియా ఎప్పుడు బరిలోకి దిగుతుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు జూన్ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో సిరీస్ రద్దు చేసింది. ఇక శ్రీలంకలో కరోనా పెద్దగా లేకపోయినా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరగాల్సిన సిరీస్‌లను రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఇండియా, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ముఖ్యంగా ఇండియాతో తమ దేశంలో పర్యటిస్తే డబ్బుతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటుందని భావిస్తోంది. జూన్ పర్యటనను వాయిదా వేయకుండా తమ దేశానికి రావాలని బీసీసీఐకి శ్రీలంక క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ఆతిథ్యం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని, అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఈ మేరకు బీసీసీఐకి మాత్రమే కాకుండా బంగ్లా క్రికెట్ బోర్డుకు కూడా లేఖలు రాసింది. దీనిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. శ్రీలంకలో క్రికెట్ ఆడటానికి మేం సిద్దంగానే ఉన్నాం. కానీ, మా ప్రభుత్వ అనుమతి లేకుండా మేం ఏమీ చేయలేమని స్పష్టం చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ బోర్డు కూడా ఇలాంటి సమాధానాన్నే ఇచ్చింది.