డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియానే ఫేవరెట్

by Shyam |
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియానే ఫేవరెట్
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ తొలి సారిగా నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్ ఇండియానే ఫేవరెట్ అని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఇండియా, న్యూజీలాండ్ జట్ల బలాలు సమానంగా ఉన్నాయి. అయితే కోహ్లీ సేన మాత్రం కచ్చితంగా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని లక్ష్మణ్ అన్నాడు. ‘ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఇండియా, కివీస్ రెండూ అన్ని విభాగాల్లో బలంగా ఉన్నాయి. టీమ్ ఇండియా గత మూడేళ్లుగా నిలకడైన ప్రదర్శన చేస్తున్నది. ముఖ్యంగా విదేశీ గడ్డపై టెస్టు మ్యాచ్‌లు గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్నది. టీమ్ ఇండియా ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కోగలదు. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ఎన్నో అవరోధాలను దాటుకొని సిరీస్ గెలుచుకున్నది. టీమ్ ఇండియాలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఉన్నారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఒకటే మ్యాచ్ కాబట్టి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసే జట్టుకే విజయావకాశాలు ఉంటాయి’ అని వీవీఎస్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు టీమ్ ఇండియా త్వరగా అలవాటు పడితే విజయం అసాధ్యమేమీ కాదని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.

Advertisement

Next Story