- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాబ్లమ్స్ ఉన్నా పాఠాలకు సిద్ధమయ్యారు
దిశ, తెలంగాణ బ్యూరో: కొన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ భౌతిక తరగతి గది బోధనకే తమ ప్రాధాన్యమని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు చాలా నష్టపోయారని, ఫిజికల్ క్లాసులు నిర్వహించకుంటే మరిన్ని సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించిన తర్వాత సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్లాల్సిందే తప్ప వెనక్కి వెళ్లడానికి సుముఖంగా లేమని స్పష్టం చేస్తున్నారు.
తరగతి గదిలో పాఠాలు చెప్పేటపుడు భౌతిక దూరం పాటించేందుకు సమస్యలేవీ లేవు. హైస్కూళ్లలో 9, 10 క్లాసులు మాత్రమే నిర్వహిస్తుండటంతో మిగతా గదులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. గదులను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆటల సమయం, భోజనం, విరామాలలో భౌతిక దూరాన్ని పాటించేలా చేయడం కొంత కష్టమయ్యేలా కనిపిస్తోంది. మధ్యాహ్న భోజనం, మెడికల్ మానిటరింగ్ కోసం ఉపాధ్యాయులను ఇన్‌చార్జిలుగా నియమించారు. సర్వీస్ పర్సన్స్ నియామకం పూర్తయితే కొవిడ్ భయాలు తగ్గడంతోపాటు బోధన సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
పాఠ్యాంశాలు బోధించేటపుడు విద్యార్థులను భౌతిక దూరం పాటించేలా నియంత్రించగలరు. టాయిలెట్స్, గ్రౌండ్స్ పరిశుభ్రంగా లేకపోతే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీపీ, మున్సిపల్ కార్మికులు గదుల శుభ్రత వరకూ పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నా టాయిలెట్లు శుభ్రం చేసేందుకు ముందుకు రావడం లేదు. స్కూళ్లలో పనిచేసేందుకు ఒప్పుకున్నా అన్నివేళలా అందుబాటులో ఉండటం సాధ్యపడటం లేదని ఇప్పటికే తేలిపోయింది. ఈ పరిస్థితులలో పాఠశాలలకు సర్వీస్ పర్సన్స్‌ను నియమించక తప్పదని, లేదంటే ఉపాధ్యాయులు, విద్యార్థులే తరగతి గదులు, టాయిలెట్స్ శుభ్రపరుచుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
విడతలవారీగా మధ్యాహ్న భోజనం
క్లాసులు ప్రారంభమైన తర్వాత కొత్తగా సమస్యలు ఎదురైతే పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నిబంధనల ప్రకారం ఐసోలేషన్ గదిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు అవసరమైనపుడు అందుబాటులో వైద్యులు లేకపోయినా ఆశ కార్యకర్తల ద్వారా ప్రాథమిక చికిత్స అందించి, అత్యవసరమైతే హాస్పిటల్‌కు తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు. మధ్యాహ్న భోజనాన్ని కూడా రెండు విడుతలలో ఇవ్వాలని నిర్ణయించారు. జాగ్రత్తలు తీసుకుంటూ బోధించడానికి పెద్దగా కష్టమేమీ కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.
విద్యార్థులు నష్టపోకుండా చూడాలి..
డిజిటల్ విద్యను అందుకోలేక విద్యార్థులు ఇప్పటికే చాలా నష్టపోయారు. ప్రభుత్వ స్కూళ్ల పిల్లలలో డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉంది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని కారణంగా వారు ఆన్‌లైన్ పాఠాలకు దూరంగా ఉన్నారు. వారి కోసమైనా భౌతిక తరగతులు అవసరం. ఉపాధ్యాయులు కూడా డ్యూటీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పరిసరాలను, టాయిలెట్లను శుభ్రం చేసేందుకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం నియమించాల్సి ఉంది. ఫిజికల్ డిస్టెన్స్ కరోనా వ్యాప్తి చెందకుండా మాత్రమే కానీ పరిష్కారం కాదు. స్కూల్ మొత్తంలో రెండు క్లాసుల పిల్లలే ఉంటారు కాబట్టి పెద్ద సమస్య ఉండదు. స్కూళ్లకు అవసరమైన కరోనా కిట్స్, మాస్క్, శానిటైజర్లు కూడా చేరాయి. విద్యార్థులు నష్టపోకుండా చూడటమే ముఖ్యం.
–చావ రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి