- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గిన తేయాకు ఎగుమతులు!
దిశ, సెంట్రల్ డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరంలో తేయాకు ఎగుమతులు స్వల్పంగా తగ్గి 24 కోట్ల కిలోలకు పడిపోయాయి. అంతకుముందు ఏడాదిలో 25.4 కోట్ల కిలోల ఎగుమతులతో పోలిస్తే 5.6 శాతం తగ్గినట్టు తేయాకు బోర్డు వెల్లడించింది. భారత తేయాకు అతిపెద్ద దిగుమతిదారు అయిన సీఐఎస్ దేశాలకు ఎగుమతులు కూడా 2018-19లో 6 కోట్ల కిలోల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 5.6 కోట్ల కిలోలకు తగ్గాయని తేయాకు బోర్డు డేటా తెలిపింది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం వల్ల ఎగుమతులు తగ్గాయని తేయాకు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్ రెండో అతిపెద్ద దిగుమతిదారుగా 4.6 కోట్ల కిలోల తేయాకును దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఇది 4.1 కోట్ల తేయాకును దిగుమతి చేసుకుంది. చైనా సైతం అంతకుముందు దిగుమతి చేసుకున్న 1.05 కోట్ల కంటే 1.2 కోట్ల తేయాకును దిగుమతి చేసుకుంది. పొరుగున ఉన్న పాకిస్తాన్‌కు కూడా ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. పాకిస్తాన్ 2018-19లో 1.4 కోట్ల కిలోల తేయాకును మన దేశం నుంచి దిగుమతి చేసుకోగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 33 లక్షల కిలోలకు తగ్గాయి. ఇక, 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో తేయాకు ఉత్పత్తి 4.3 కోట్ల కిలోలకు పడిపోయింది. అంతకుముందు ఏడాదిలో ఇదే సమయంలో 7.4 కోట్ల తేయాకు ఉత్పత్తి జరిగింది.