- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం.. జగన్ సైకో మనస్తత్వానికి నిదర్శనం
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నియంత కంటే ఘోరంగా ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని.. ఎంపీ రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తే, జగన్ రెడ్డి సర్కారుపై విశ్వాసం లేదని 5 కోట్ల ఆంధ్రులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
వారందరినీ అరెస్ట్ చేస్తారా? ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్క చేయకుండా.. వై కేటగిరి భద్రతలో వుంటూ ఇటీవలే బైపాస్ సర్జరీ చేసుకున్న సొంత పార్టీ ఎంపీని ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం జగన్‌రెడ్డి సైకో మనస్తత్వానికి నిదర్శనం. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(CID) కాస్తా సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. ప్రశ్నిస్తే సీఐడీ అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేరకపోతే జేసీబీతో ధ్వంసం, లొంగకపోతే పీసీబీ తనిఖీలు. ఇదీ నియంత సైకో జగన్‌రెడ్డి పాలన. జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
నియంత కంటే ఘోరంగా ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా, తన కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి @ysjagan. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని..(1/4) pic.twitter.com/qV8dIBtXNn
— Lokesh Nara (@naralokesh) May 14, 2021