ఏపీలో బాక్సైట్ కుంభకోణం.. సీఎం జగన్‌పై లోకేశ్ ఆగ్రహం

by srinivas |
ఏపీలో బాక్సైట్ కుంభకోణం.. సీఎం జగన్‌పై లోకేశ్ ఆగ్రహం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్ అతిపెద్ద అవినీతి పరుడంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్‌ అవినీతి స్థాయికి రూ.15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం అద్దం పడుతోందని ట్విటర్ వేదికగా విమర్శించారు. విశాఖ మన్యంలో వైసీపీ మాఫియా బాక్సైట్‌ గనుల దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. బాక్సైట్ దోపిడీ కోసం ప్రభుత్వమే రహదారి నిర్మించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రికార్డు స్థాయిలో 24 రోజుల వ్యవధిలోనే అటవీ ప్రాంతంలో 14కి.మీ మేర 30 అడుగుల రహదారిని నిర్మించడం వెనుక అంతరార్థం ఏంటని లోకేశ్ ప్రశ్నించారు. ఈరోడ్డు కోసం సుమారు 10 వేల చెట్లు నరికేశారని ఆరోపించారు. బాక్సైట్ దోపిడీకి రోడ్లు వేశారని అందరికీ తెలుస్తున్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం వాస్తవాన్ని దాచే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 250 మంది జనాభా ఉన్న మారుమూల ప్రాంతానికి రహదారి వేశామని చెప్పడం జగన్‌రెడ్డి సర్కార్ అవినీతికి పరాకాష్ట అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed