- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారీ కుంభకోణం జరిగింది.. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణ
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గ్రామాల్లో హైవేకు ఆనుకుని రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. మంత్రి, ఎంపీల అండ చూసుకుని వైసీపీ నేతలు భూకబ్జాకు పాల్పడ్డారన్నారు. ప్రభుత్వ భూములకు లే అవుట్లు వేసి అక్రమంగా అమ్మేస్తున్నారని కిశోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఊర్లు, సర్వే నెంబర్ల వివరాలతో మీడియా ముందు కిశోర్ ఫొటోలు బయటపెట్టారు. జిల్లాలో భూ అక్రమాలపై సర్వే నెంబర్లు సహా త్వరలోనే బయటపెడతామన్నారు. భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలన్నారు.
Next Story