టీడీపీ హయాంలోనే అభివృద్ధి: బక్కని నర్సింహులు.

by Shyam |   ( Updated:2021-10-11 10:44:55.0  )
టీడీపీ హయాంలోనే అభివృద్ధి: బక్కని నర్సింహులు.
X

దిశ, సికింద్రాబాద్ : తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి మీదే ముఖ్యమంత్రి కేసీఆర్ వంట చేస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. సోమవారం బౌద్ధ నగర్ లో టీడీపీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వల్లారపు శ్రీనివాస ఆధ్వర్యంలో నియోజకవర్గ డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ట్రస్టీలు లేకుండా పని చేయాలన్నారు. ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలో అనే ఆలోచనే తప్ప, ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు.

తెలంగాణ లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, మూడు ఎకరాల భూమి ఇస్తామని మోసం చేశారన్నారు. మరల ప్రజలు చంద్రబాబు నాయుడు పాలన ను కోరుకుంటున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రం టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు తప్పా, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లొ ఏమి జరగటం లేదన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

Advertisement

Next Story