తిరుపతి వెంకన్న సాక్షిగా.. వైసీపీకి అచ్చెన్న సవాల్

by srinivas |
తిరుపతి వెంకన్న సాక్షిగా.. వైసీపీకి అచ్చెన్న సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో వైసీపీది దొంగ ఓట్లు, దొంగ నోట్లతో ప్రజలను ప్రలోభపెట్టి విజయం సాధించిందని విమర్శించారు. ఇది నిజమైన విజయం కాదని.. ప్రైవేటు బస్సుల విజయమని ప్రజలే అంటున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ఓటర్ల హక్కును కాలరాసి తెచ్చుకున్నది విజయమే కాదని మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచినా నైతికంగా టీడీపీనే గెలిచిందని ప్రజలు అంటున్నారని గుర్తుచేశారు. వైసీపీ దురాగతాలను దగ్గరుండి చూపించిన టీడీపీ కార్యకర్తలు, నాయకుల తెగువను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. దొంగ ఓట్లకు పాల్పడలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా వైసీపీ నేతలు బహిరంగ ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed