తిరుపతి బై పోల్స్: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

by srinivas |
తిరుపతి బై పోల్స్:  కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో జరిగిన అవాంచనీయ సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల మాట్లాడారు. ఈ సందర్బంగా తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బయటపడ్డ దొంగ ఓటర్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అలాగే దొంగ ఓటర్లను పట్టుకున్న వీడియోలను ఈసీకి పంపించారు. నకిలీ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల వద్ద తిరగడం, బస్సుల్లో నకిలీ ఓటర్లను తరలించడంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.

Advertisement

Next Story