- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రజలకు ఇబ్బందులు

దిశ, పటాన్‌చెరు:
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే హైదరాబాద్ మహానగరాన్ని వరదలు ముంచెత్తాయని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ మున్సిపాలిటీ ఇసుకబావి నాలాలో కారుతో సహా వ్యక్తి కొట్టుకుపోయిన స్థలాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ…. మల్లికార్జున్ అనే వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోతే నేటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కాలనీలను వరదలు ముంచెత్తితే కనీసం ప్రజలను పరామర్శించే తీరిక సీఎం కేసీఆర్‌కు లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరమంటూ పొద్దున లేస్తే కేటీఆర్ ఊకదంపుడు ప్రచారాలను చేస్తారనీ, కానీ ఇప్పుడు వరదలకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారని తెలిపారు. అవకాశం దొరికినప్పుడల్లా హైదరాబాద్‌ను తామే అభివృద్ది చేశామంటూ ప్రగల్భాలు వారు పలికారని ఆయన అన్నారు. లోపాల విషయానికి వచ్చేసరికి గత ప్రభుత్వాలపైకి నెట్టడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.