- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా టీసీఎస్!
దిశ, వెబ్‌డెస్క్: భారత సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి యాక్సెంచర్‌ను అధిగమించి అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించింది. సోమవారం నాటి మార్కెట్ పరిణామాలతో టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 12.5 లక్షల కోట్లకు చేరుకుంది. యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 12.4 లక్షల కోట్లకు పరిమితమైంది. ఇదివరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంశంలో టీసీఎస్ సంస్థ రెండుసార్లు యాక్సెంచర్‌ను అధిగమించింది.
మొదటిసారిగా 2018లోనూ, అనంతరం గతేడాది అక్టోబర్‌లో టీసీఎస్ ఈ ఘనతను సాధించింది. 2018లో టీసీఎస్ సంస్థ యాక్సెంచర్ కంటే విలువైన కంపెనీగా ఉన్నప్పటికీ, ఆ సమయంలో ఐబీఎం సంస్థ టీసీఎస్ కంటే 300 శాతం ఎక్కువ ఆదాయంతో అగ్రస్థానంలో ఉండేది. అనంతరం గతేడాది అక్టోబర్‌లో టీసీఎస్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ సంస్థ మెరుగైన ఆదాయాన్ని నమోదు చేసింది.