- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టాటా స్టీల్ ఆదాయం 12 శాతం వృద్ధి
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఉక్కు తయారీ దిగ్గజం టాటా స్టీల్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,989 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 1,166 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.5 శాతం పెరిగి రూ. 39,594 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నిర్వహణ లాభం రూ. 9,540 కోట్లతో, అంతకుముందు ఆర్థిక సంవత్సరం త్రైమాసికంతో పోలిస్తే 2.6 రెట్లు పెరిగిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
దేశీయంగా బలమైన నిర్వహణ పనితీరు, అధిక ధరలు, మెరుగైన ఉత్పత్తి, తక్కువ ఎగుమతులు, నిర్వహణ సామర్థ్యం కారణంగానే కంపెనీ మెరుగైన ఫలితాలను వెల్లడించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. టాటా స్టీల్ డిసెంబర్ త్రైమాసికంలో తన అప్పులను రూ. 10,325 కోట్లకు తగ్గించిందని, డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో కంపెనీ అప్పులు రూ. 18,609 కోట్లు తగ్గినట్టు పేర్కొంది. ‘అంతర్జాతీయంగానే కాకుండా, భారత ఆర్థికవ్యవస్థ కోలుకోవడంతో దేశీయంగా ఉక్కు డిమాండ్ గణనీయంగా మెరుగుపడింది. ఎగుమతులను తగ్గించడం ద్వారా స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు వీలైందని’ టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు.