- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాహన విక్రయాల్లో టాటా మోటార్స్ అదుర్స్
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ అక్టోబర్‌లో ప్యాసింజర్ విభాగంలో 79 శాతం వృద్ధిని సాధించింది. అక్టోబర్‌లో 23,617 యూనిట్ల విక్రయాలు జరగ్గా, అంతకుముందు ఏడాది ఇదే నెలలో కంపెనీ 13,169 యూనిట్ల విక్రయాలు జరిగినట్టు కంపెనీ తెలిపింది. దేశీయ అమ్మకాలు 49,669 యూనిట్లుగా ఉండగా, గతేడాదితో పోలిస్తే ఈసారి 27 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. వాణిజ్య వాహనాల విభాగంలో గతేడాది 25,983 యూనిట్లతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో 26,052 యూనిట్లు అమ్ముడుపోయాయి. వాణిజ్య వాహనాల ఎగుమతులు అక్టోబర్‌లో 2,420 యూనిట్లతో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్యాసింజర్ క్యారియర్ వాహనాల అమ్మకాలు 56 శాతం క్షీణించి 755 యూనిట్లకు పరిమితమయ్యాయి.
Advertisement
Next Story