- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంగనాకు తాప్సీ కౌంటర్
బాలీవుడ్లో ఓ రకమైన యుద్ధం జరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బంధుప్రీతి తనను చంపేసిందని కరణ్ జోహార్, మహేశ్ భట్‌పై హీరోయిన్ కంగనా రనౌత్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా తాప్సీ పన్ను, స్వరా భాస్కర్ లాంటి హీరోయిన్లను ‘బీ గ్రేడ్ యాక్టర్స్’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అనన్య పాండే, అలియా భట్ కన్నా టాలెంట్, అందం ఉన్నా సరే.. వీళ్లకు పని ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించింది.
దీనిపై కాస్త ఘాటుగానే స్పందించారు తాప్సీ, స్వర. ‘టెన్త్, ఇంటర్‌కు మాత్రమే రిజల్ట్స్ వచ్చాయనుకున్నా, మాకు కూడా ఫలితాలొచ్చాయి. కానీ, అది నంబర్ సిస్టమ్‌లో కాదు.. నాకు ‘బీ’ గ్రేడ్ వచ్చిందని’ కౌంటర్ వేసింది తాప్సీ. స్వర విషయానికొస్తే అసలు కంగనా మాట్లాడే మాటలకు నవ్వాలో ఏడ్వాలో కూడా తెలియడం లేదన్నట్లుగా విమర్శించింది.
నా కెరియర్ నా ఇష్టం అన్నట్లుగా స్పందించిన తాప్సీ.. అసలు మా కెరియర్ గురించి చెప్పేందుకు కంగనా ఎవరన్నట్లుగా మాట్లాడింది. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ సాధిస్తున్నా.. తనకు పని దొరకడం లేదని కంగనా ఎలా చెప్తుందని ప్రశ్నించింది. సుశాంత్ సింగ్ మరణాన్ని కంగనా వాడుకుంటోందని, ఔట్సైడర్స్కు అంబాసిడర్ అయిపోయి ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని మండిపడింది. నెపోటిజంకు సపోర్ట్ చేస్తున్నారు, ఇండస్ట్రీ గురించి మాట్లాడడం లేదంటున్న కంగనాకు సమాధానమిస్తూ.. ‘నేను ఎవరికీ సపోర్ట్ చేయను, ఎవరితోనూ శతృత్వం కూడా పెట్టుకోను’ అని తెలిపింది తాప్సీ. ఇండస్ట్రీలో మనతో పాటు అందరూ ఆనందంగా ఉండాలనే ఫిలాసఫీ తనదని.. అన్నం పెడుతున్న ఇండస్ట్రీ గురించి చెడుగా మాట్లాడే అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాప్సీకి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ లభిస్తోంది. మంచు లక్ష్మీ ప్రసన్న, నవదీప్ లాంటి నటులు తాప్సీ ఇలాగే ముందుకెళ్లు అంటూ ట్వీట్ చేస్తున్నారు.
మరికొందరు నెటిజన్లు సైతం కంగనా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. నటీనటులకు చాన్స్ ఇవ్వలేదని కరణ్ జోహార్‌ను విమర్శిస్తున్న కంగనా.. మణికర్ణిక సినిమాలో నటులను పక్కకు పెట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘కరణ్ చేసింది తప్పని వాదిస్తున్నప్పుడు.. కంగనా చేసింది కూడా తప్పే’ అవుతుందని అంటున్నారు.