‘రష్మి రాకెట్’ కోసం తాప్సీ ప్రిపరేషన్

by Anukaran |   ( Updated:2020-08-26 02:48:48.0  )
‘రష్మి రాకెట్’ కోసం తాప్సీ ప్రిపరేషన్
X

హీరోయిన్ తాప్సీ పన్ను కెరియర్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండగా.. ప్రస్తుతం ‘రష్మి రాకెట్’ సినిమాతో రాకెట్‌ వేగాన్ని అందుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదల కాగా, మంచి కాంప్లిమెంట్స్ అందుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాలో తాప్సీ అథ్లెట్‌గా నటిస్తుండగా.. అథ్లెట్ బాడీ గెయిన్ చేసేందుకు డైట్ ఫాలో అవుతోంది. తన క్యారెక్టర్‌లో జీవించేందుకు నిరంతరం కష్టపడే తాప్సీ.. తనను ఆ క్యారెక్టర్‌కు తగినట్లుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటోంది.

‘రష్మి రాకెట్’ కోసం తన ప్రిపరేషన్ ఎలా ఉందో చెప్తూ సోషల్ మీడియాలో పిక్ షేర్ చేసిన తాప్సీ.. న్యూట్రిషనిస్ట్ మన్మున్ గనెరివల్ సూచన మేరకు ఫుడ్ తీసుకుంటూ ప్రోటీన్స్‌తో పాటు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాన్ని ప్రిఫర్ చేస్తున్నట్లు చెప్పింది. హై ఫైబర్ ఉండే స్వీట్ పొటాటో టిక్కిస్‌ టేస్ట్ చాలా బాగుందని మీరు కూడా ట్రై చేయొచ్చని సలహా ఇస్తోంది.

https://www.instagram.com/p/CEVyaDUJnj1/?igshid=i2x225oxjrj0

Advertisement

Next Story