- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ని జెండాలున్నా.. ప్రజల గుండెళ్లో ఉండేది ఎర్రజెండానే : తమ్మినేని
దిశ, తుంగతుర్తి: ఎన్ని జెండాలున్నా.. ఎర్రజెండా(సీపీఎం) ప్రజల గుండెల్లో ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని చిల్పకుంట్ల గ్రామంలో సీపీఎం గ్రామశాఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ… రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి గ్రామీణ స్థాయిలో గ్రామశాఖలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోందన్నారు. గ్రామ స్థాయిలోని కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. నాటి నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడుతూ దున్నేవాడికే భూమి అని దొరల భూముల్లో ఎర్రజెండాను పాతి పేదలకు పంచిన తొట్ల మల్సూరు పుట్టిన గడ్డ చిల్పకుంట్ల గడ్డ అని కొనియాడారు.
తొట్ల మల్సూర్ నింపిన ఉద్యమ స్ఫూర్తి ఇప్పటికీ చిల్పకుంట్ల యువతలో ఇంకా ఉందన్నారు. అనంతరం ప్రజానాట్య మండలి కళాకారులచే ఆటాపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగర్జున్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకలపల్లి రాములు, శ్రీరాములు, కందాల శంకర్ రెడ్డి, సంజీవరెడ్డి, తొట్ల లింగయ్య, పులుసు ప్రహ్లాద, బొజ్జ శ్రీను, తొట్ల హరీష్, కట్ట నర్సిరెడ్డి, బత్తుల సందీప్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.