- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సినిమాలకు షరతులతో అనుమతి: తలసాని
దిశ, న్యూస్‌బ్యూరో: సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు చర్యలు చేపట్టనున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎంసీహెచ్ఆర్‌డీలో సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రతినిధులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు షూటింగ్‌లు, థియేటర్లలో తీసుకోవాల్సిన జాగ్రతలను తెలియజేస్తూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. షూటింగ్ అనంతరం ఇళ్లకు వెళ్లే సినీ నటులు, కార్మికులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖకు దరఖాస్తు చేస్తే ఈ-పాస్‌లు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు. ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని సమావేశంలో పాల్గొన్న సినీ, టీవీ రంగ ప్రతినిధులు స్పష్టం చేశారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినీ రంగానికి చెందిన ఏ విషయమైనా ప్రభుత్వం ఎప్పుడూ అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు అందజేసిన సూచనలు, వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, నాగార్జున, దర్శకులు రాజమౌళి, ఎన్.శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.