- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజుకో యాపిల్ ఉన్నా.. వైద్యులు అవసరమే!
డాక్టర్స్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు వైద్యులను ప్రశంసిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన బాలీవుడ్ సెలబ్రిటీ తహిరా కశ్యప్ స్పెషల్ పోస్ట్ పెట్టింది.
అసలు ఇంతకు ముందు డాక్టర్స్ డే ఉంటుందో లేదో కూడా తెలియదన్న తహిరా.. తనకు కలిగిన అనారోగ్య సమస్యలు వైద్యుల విలువను తెలుసుకునేలా చేశాయని చెప్పింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో డాక్టర్లు, నర్సులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. 2019 జనవరి 5న తీసిన ఆ ఫొటోను.. తన 12వ, చివరి కీమోథెరపీ చేసిన రోజున తీసుకున్న ఫొటో అని వివరించింది. తనకు మళ్లీ పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించిన వారికి ఆరోజు చాకొలెట్స్ అందించి థ్యాంక్స్ చెప్పానంది. ఇప్పుడు కూడా మరో చాకొలెట్ బాక్స్ ఇవ్వాలని ఉన్నా కరోనా పరిస్థితుల్లో వెళ్లే చాన్స్ లేదని చెప్పింది.
https://www.instagram.com/p/CCFpdGLntHE/?utm_source=ig_web_copy_link
రోజుకో యాపిల్.. డాక్టర్‌ను దూరంగా ఉంచుతుందని పెద్దలు చెప్తుంటారు. కానీ తన దగ్గర ఎన్ని ఆపిల్స్ ఉన్నా డాక్టర్స్‌ను మాత్రం దూరం పెట్టనని చెప్తోంది తహీరా.