- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
300 ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయిన హీరో..
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్టర్ తహీర్ రాజ్ భాసిన్ సినిమాల్లో చాన్స్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో తాజా ఇంటర్వ్యూలో వివరించాడు. ముంబైలో ఎంటర్ కాగానే ధర్మ ప్రొడక్షన్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్ లాంటి పెద్ద పెద్ద బ్యానర్లలో పనిచేస్తానని అనుకున్న.. కానీ సిటీకి వస్తే తప్ప ఆ కష్టాలు ఎలా ఉంటాయో అర్థం కాలేదన్నాడు. ముంబైకి వచ్చిన దాదాపు మూడు నెలల తర్వాత ఇళ్లు అద్దెకు దొరికిందన్న హీరో.. దాదాపు 300 ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయి ఉంటానని తెలిపాడు. రాణీ ముఖర్జి లీడ్ రోల్ ప్లే చేసిన ‘మర్దానీ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచమైన తహీర్.. ఈ క్యారెక్టర్ పొందేందుకు నాలుగేళ్లు పట్టిందని వివరించాడు. కానీ ప్రతీ ఆడిషన్ కూడా ఈ చాన్స్ దక్కేందుకు హెల్ప్ చేసిందని నమ్ముతున్నట్లు చెప్పాడు. ‘చిచోరే’, ‘ఫోర్స్ 2’ లాంటి చిత్రాలతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న తహీర్.. ‘83’, ‘లూప్ లపేటా’ మూవీస్‌తో ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.