- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తాప్సీ ‘రష్మి రాకెట్’ లుక్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను వర్సటైల్ యాక్టర్‌గా ప్రశంసలు పొందుతోంది. ‘పింక్’ చిత్రం నుంచి ‘థప్పడ్’ వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో మెప్పిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇప్పటికీ అభిమానులు థప్పడ్‌లో తాప్సీ నటన గురించి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లకు దూరంగా ఉన్నఈ భామ.. సెట్స్ మీదకు వెళ్లే టైమ్ వచ్చింది అంటూ తన కొత్త సినిమా గురించి వివరించింది.
Getting back on track, one lap at a time! #RashmiRocket to start shooting this November. #FridaysWithRSVP@MrAkvarious @taapsee @priyanshu29 @ItsAmitTrivedi #NandaPeriyasamy @AniGuha @KanikaDhillon @RonnieScrewvala #PranjalKhandhdiya #NehaAnand @iammangopeople @bharatrawail pic.twitter.com/gGTLtOMI3X
— RSVP Movies (@RSVPMovies) August 21, 2020
‘రష్మి రాకెట్’ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆర్ఎస్వీపీ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న మూవీని ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేస్తుండగా..షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రష్మి రాకెట్’ సినిమాలో తాప్సీ ఫాస్ట్ రన్నర్‌గా కనిపించనుంది. గుజరాత్‌లోని పల్లెటూరికి చెందిన రష్మి అనే యువతి కథ సినిమా కాగా, తను పరుగెత్తే స్పీడ్‌ను చూసి గ్రామస్తులు రష్మి రాకెట్‌గా పిలుస్తుంటారు. ఫస్ట్ లుక్‌కు నెటిజన్ల నుంచి సూపర్ కాంప్లిమెంట్స్ అందుతున్నాయి.