- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిక్‌టాకర్ల పనికి షార్ట్ వీడియో యాప్స్‌కు నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: టిక్ టాక్ బ్యాన్ తర్వాత షార్ట్ వీడియో యాప్స్ కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. వీటిలో ‘బోలో ఇండ్యా, మిత్రోన్, ఎంఎక్స్ ప్లేయర్ వారి టకాటక్, ట్రిల్లర్, జోష్’ యాప్స్ ఉన్నాయి. అయితే, తమ పాపులారిటీని అదే విధంగా ఉంచుకోవడానికి టిక్ టాకర్లు తమ పాత వీడియోలనే ఈ యాప్స్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో తమ మ్యూజిక్‌ను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ టి-సిరీస్ సంస్థ ఈ యాప్స్‌కు కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ఒక్కో యాప్ రూ. 3.6 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి సంబంధిత షార్ట్ వీడియో యాప్‌ల కంపెనీలు మరోలా స్పందిస్తున్నాయి.
తాము యూజర్ జెనరేట్ చేసిన కంటెంట్ మీద ఆధారపడి పనిచేస్తున్నామని, తాము స్వయంగా ఎలాంటి మ్యూజిక్ లైబ్రరీలను, పాటలను యూజర్లకు అందించడం లేదని వారు వాదిస్తున్నారు. ఇలా చూస్తే టి-సిరీస్ వారు పంపించిన కాపీ రైట్ ఉల్లంఘనలకు తాము బాధ్యులం కాబోమని చెబుతున్నారు. టి-సిరీస్ వారు సహకరిస్తే వారితో ఒప్పందం చేసుకుని లైసెన్స్ తీసుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని షార్ట్ వీడియో యాప్ సంస్థలు అంటున్నాయి. 40వేలకు పైగా వీడియోలు, 1.5 లక్షల పాటలతో టి-సిరీస్ వారి బ్రాండింగ్ ఉంది. ఇప్పటికే ‘అమెజాన్ ప్రైమ్, అమెజాన్ మ్యూజిక్, గానా, సావన్, వింక్, స్పాటిఫై’ వంటి మ్యూజిక్ యాప్ సంస్థలు టి-సిరీస్ లైసెన్స్ పొంది ఉన్నాయి. ఇప్పుడు వారి మ్యూజిక్‌ను ఉపయోగించుకోవడానికి షార్ట్ వీడియో యాప్స్ కూడా లైసెన్స్‌లు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.