- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ల్యాబ్ 32 ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు కోరిన టీ-హబ్!
దిశ, వెబ్‌డెస్క్: కొత్త అవిష్కరణలకు వేదికగా నిలుస్తోన్న తెలంగాణ టీ-బబ్ గురువారం ప్రీ-యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ ల్యాబ్ 32 కోసం దరఖాస్తులను కోరింది. ఇదివరకు జరిగిన మూడో బ్యాచ్ ద్వారా 41, నాలుగో బ్యాచ్‌లో 13 స్టార్టప్‌లతో విజయవంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో గత 12 నెలల్లో రూ. 100 కోట్లను సేకరించాయి. ల్యాబ్ 32 ఐదో బ్యాచ్ మార్చి 15న ప్రారంభమవనుంది. హెల్త్-టెక్, ఫిన్‌టెక్, స్మార్ట్ మొబిలిటీ, ఎడ్‌టెక్ వంటి పరిశ్రమలకు పరిష్కారాలను అందించే స్టార్టాప్‌లను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. విస్తృతమైన స్క్రీనింగ్ ప్రక్రియ అనంతరం 30 నుంచి 35 స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు.
ఇదివరకు ల్యాబ్ 32 ప్రోగ్రాం కోసం షార్ట్‌లిస్ట్ అయిన స్టార్టప్‌లు తప్పనిసరి హైదరాబాద్‌కు రావాల్సి ఉండేది. అయితే, కొత్తగా హైబ్రిడ్ ప్రోగ్రాం కింద షార్ట్‌లిస్ట్ అయ్యే స్టార్టప్‌లు హైదరాబాద్ రాకపోయినప్పటికీ అన్ని రకాల ప్రయోజనాల వెసులుబాటును టీ-హబ్ అందించనున్నది. ‘ఇప్పటివరకు ల్యాబ్ 32 నుంచి హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, స్మార్ట్ మొబిలిటీ వంటి ప్రధాన రంగాల్లో ఉన్న స్టార్టప్‌లు లబ్ది పొందాయి. గతం కంటే ఇప్పుడు ప్రీ-యాక్సిలరేషన్ ప్రోగ్రాం వర్చువల్‌గా కొనసాగించేందుకు మరింత ప్రేరణ కలిగిస్తోంది. ఐదో బ్యాచ్ ప్రపంచస్థాయిలో దేశ ఇన్నోవేషన్‌ను వేగవంతం చేసే స్టార్టప్‌లపై దృష్టి పెడుతుందని’ టీ-హబ్ సీఈవో రవి నారాయణ్ వెల్లడించారు.