ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వండి.. ఫొటో ట్యాగ్ చేయండి : మాధురి

మన జీవితంలో వివిధ దశలను దాటుతున్న కొద్దీ స్నేహితులు జాబితా పెరుగుతూ ఉంటుంది. అయితే, జీవన గమనంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల.. కొందరు ఫ్రెండ్స్‌ మన కాంటాక్ట్ నుంచి మిస్ అయిపోతారు. వాళ్లు మనకు తరచూ గుర్తొచ్చినా, ఎప్పుడో గానీ మాట్లాడం. అందుకే బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ‘స్నేహితులతో కనెక్ట్ అవ్వండి’ అంటూ పిలుపునిచ్చింది. అంతేకాదు ఎక్కువ రోజులుగా ఎవరితోనైతే మాట్లాడలేకపోతే వారితో ఈ రోజు మాట్లాడండని కోరారు. ‘స్నేహం చేయడం సులభమే.. కానీ దాన్ని కొనసాగించడమే కొంచెం కష్టంతో కూడుకున్న పని’ అని ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు.

‘అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. స్నేహం అనేది చాలా అందమైనది.. అర్థవంతమైనది. స్నేహం చేయడం చాలా ఈజీనే.. కానీ దాన్ని మెయింటెన్‌ చేయడమే చాలా కష్టం. మా బిజీ షెడ్యూల్‌ వల్ల మేం ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడపలేకపోతాం’ అని రాసుకొచ్చింది మాధురి. ‘ఇంకెందుకాలస్యం వెంటనే ఫోన్‌ అందుకోండి.. మీ స్నేహితులతో మాట్లాడండి.. జీవితంలో ప్రతి ఫ్రెండూ అవసరమే’ అని సూచించింది. అంతేకాదు.. ‘మీరు మీ స్నేహితులతో కనెక్ట్ అయిన మూమెంట్స్ నాకెంతో ఇష్టం. ఆ మధురు జ్ఞాపకాలను ఫొటోలుగా మలచండి. ఆ ఫోటోలను నాకు ట్యాగ్ చేయండి’ అని తెలిపింది.

https://www.instagram.com/p/CDYMnVnqvQj/

Advertisement