కంటతడి పెట్టిన మహ్మద్ సిరాజ్

by Anukaran |   ( Updated:2021-01-07 06:46:22.0  )
కంటతడి పెట్టిన మహ్మద్ సిరాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. గురువారం ఆసీస్‌తో మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలాపన సందర్భంగా భావోద్వేగానికి గురై ఏడ్చాడు. ఆసమయంలో మానాన్న గుర్తుకు వచ్చాడని, తనను క్రికెటర్‌గా చూడాలని ఎప్పుడూ కలలు కనేవాడని, నేను టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే ఒక్కసారైనా చూడాలని తనతో చెప్పేవాడని సిరాజ్ అన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్నా, కానీ చూడటానికి ఆయన లేరు. నేను ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే ఆయన చనిపోయారు. అదంతా గుర్తుకువచ్చి కన్నీళ్లు ఉబికి వచ్చాయని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా సిరాజ్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story