మొహంపై రక్తపు గాట్లు.. బాలుడి అనుమానాస్పద మృతి

by Sumithra |
మొహంపై రక్తపు గాట్లు.. బాలుడి అనుమానాస్పద మృతి
X

దిశ, ఆలేరు : భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని వాసాలమర్రి గ్రామం పెట్రోల్ బంక్ వద్ద నాలుగు నెలల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాలుడి మొహంపై రక్తపు గాట్లు ఉన్నాయి. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం గ్రామగ్రామాన తిరుగుతూ జీవనం సాగిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు తుర్కపల్లి మండల కేంద్రంలోని వాసాల మర్రి సమీపంలో కోళ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే తల్లిదండ్రులతో కలిసి రోజు మాదిరిగానే రాత్రి నిద్రించిన బాలుడు తెల్లవారు జామున రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. మొహంపై గాట్లు ఉండటాన్ని గమనించి కుక్కలు చంపాయా లేక ఏదైనా జంతువు చంపేసిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, చనిపోయిన బాలుని తల్లిదండ్రులను, తాతను కూడా విచారిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story