అలియా కెరియర్‌పై సుశాంత్ ఎఫెక్ట్..

by Jakkula Samataha |
అలియా కెరియర్‌పై సుశాంత్ ఎఫెక్ట్..
X

బాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్, అలియా భట్ కెరియర్ సాఫీగా సాగుతున్న వేళ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం.. తన కెరియర్ గ్రాఫ్‌ను ఒక్కసారిగా డ్రాప్ చేసే అవకాశాలున్నాయి. ప్రతీ ఒక్కరికీ ఒక రోజొస్తుంది అన్నట్లు.. గతంలో సుశాంత్ అంటే ఎవరో తెలియదన్న అలియాకు ‘దిస్ ఈజ్ సుశాంత్’ అని చూపిస్తున్నారు అభిమానులు. నెపోటిజాన్ని ప్రోత్సహిస్తూ సుశాంత్‌ను పక్కన పెట్టిన అలియా తండ్రి మహేష్ భట్, బాబాయ్ ముఖేష్ భట్‌లకు కూడా దిమ్మ తిరిగే సమాధానం చెప్తున్నారు.

మహేష్ భట్ దర్శకత్వంలో ముఖేష్ భట్ నిర్మించిన చిత్రం ‘సడక్ 2’. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 56 లక్షల డిస్ లైక్స్ పొందిన చిత్రంగా సడక్ 2కు చెత్త రికార్డును గిఫ్ట్‌గా ఇచ్చారు సుశాంత్ ఫ్యాన్స్. ఇక ఆగస్ట్ 28న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar VIP)లో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించిన ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

కాగా భట్ ఫ్యామిలీ నుంచి ఏ చిత్రం రిలీజ్ అయినా సరే.. ఇదే పరిస్థితి ఉంటుందని గతంలోనే హెచ్చరించిన అభిమానులు ఇప్పుడు చేతల్లో చేసి చూపించారు. భవిష్యత్తులోనూ చూపిస్తామని చెప్తున్నారు.

దీంతో అలియా భట్ ఉంటే సినిమాకు హైప్ క్రియేట్ అవుతుందని భావించి, తనను ఏరి కోరి తీసుకున్న దర్శక నిర్మాతలే ఇప్పుడు ఆలోచనలో పడిపోయారు. అభిమానులు తలచుకుంటే సినిమాను డిజాస్టర్ చేయగలరన్న విషయాన్ని సడక్ 2 రూపంలో ప్రత్యక్షంగా చూసిన ఫిల్మ్ మేకర్స్ ఆందోళన చెందడంలో వింతేమీ లేదు. ఈ ఎఫెక్ట్‌తో తమ సినిమాల్లో అలియాను మరో హీరోయిన్‌తో రీప్లేస్ చేయొచ్చు లేదా ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా ఆపేయవచ్చని చెబుతున్నారు విశ్లేషకులు. కానీ నెపోటిజం చర్చ ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేదు కాబట్టి.. అలియాను పక్కన పెట్టే చాన్స్‌లే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

టాలీవుడ్ విషయానికొస్తే

దర్శక ధీరుడు జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో అలియా భట్ కీలక పాత్రలో కనిపించబోతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలో అలియా టాలెంట్ ప్లస్ అవుతుందని భావించాడు రాజమౌళి. కానీ పరిస్థితులు ఇప్పుడు తారుమారయ్యాయి. అలియా ఉంటే ఏం జరుగుతుందో.. సినిమాకు ఎంత నష్టం కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో జక్కన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed