- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్‌ను చంపింది దావూద్ గ్యాంగే ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఎన్నో అనుమానాలు. పోలీసులు ఆత్మహత్య అని నిర్ధారించినా సరే, అభిమానులు మాత్రం ఇది ముమ్మాటికి హత్యేనని పోరాటం చేస్తున్నారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. బంధుప్రీతి, ఒత్తిడి అనేవి ఆత్మహత్యకు కారణాలు కాదని.. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని సోషల్ మీడియాలో సుశాంత్ చనిపోయిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) మాజీ అధికారి ఎన్‌కే సూద్ విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.
సుశాంత్ సూసైడ్ చేసుకోలేదని.. ఇది ప్రొఫెషనల్స్ చేసిన మర్డర్ అని తెలిపారు. దీనిపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారన్న సూద్.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కానీ, ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ కానీ సుశాంత్‌ను ఆత్మహత్య చేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అసలు సుశాంత్‌ది ఆత్మహత్య అని పోలీసులు ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. తన గదిలో సూసైడ్ నోట్ కూడా లేనప్పుడు అలా ఎలా? నిర్ణయించారన్న సూద్.. సుశాంత్ చనిపోయే ముందు 50 సిమ్ కార్డులు చేంజ్ చేశాడని.. దీనిపై పోలీసులు ఏం సమాధానం చెప్తారన్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలతోనూ దావూద్ గ్యాంగ్‌కు సంబంధాలున్నాయని రివీల్ చేసిన సూద్.. తను ఇచ్చే పార్టీలకు కూడా వెళ్తుంటారని ఆరోపించాడు. దావూద్ చెప్పే పనులు చేస్తూ బిజినెస్‌కు హెల్ప్ చేస్తుంటారని.. అతను ఇచ్చే ముడుపులు కూడా తీసుకుంటుంటారని వీడియోలో తెలిపారు సూద్.