- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుశాంత్‌ది ఆత్మహత్య కాదా.. హత్యేనా?
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతనిది ఆత్మహత్య కాదని.. హత్యే అని పలువురు ఆరోపిస్తున్నారు. సుశాంత్ మృతిపై బంధువులే కాదు, రాజకీయ నాయకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ కేసులో విచారణ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తొలుత సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు భావించినా.. ఆ తర్వాత ఇది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా హత్యే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా, ఆంబులెన్స్ సహాయకుడు చెప్పిన విషయాలతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఎవరైనా ఉరేసుకుంటే మెడచుట్టూ గుర్తులుంటాయి. కానీ సుశాంత్ మృతదేహం మెడ ముందు భాగంలో మాత్రంలో గుర్తు కనిపించింది. అంతేకాకుండా, సుశాంత్ కాళ్లు వంగి ఉన్నాయి. ఎవరైనా ఉరేసుకుంటే కాళ్లు ఎలా వంగిపోతాయి. సుశాంత్ కాలిపై తనకు ఓ గుర్తు కనిపించిందని ఆ సహాయకుడు చెప్పుకొచ్చాడు. సుశాంత్ మృతదేహాన్ని మొదట చూసినపుడు పసుపుపచ్చ రంగులో ఉంది.
ఒకవేళ ఉరేసుకుంటే శరీరం రంగు మారదు. నోటి నుంచి నురగ వస్తుంది. కానీ నేను సుశాంత్ బాడీపై ఎలాంటి నురగ లేదని అధికారులకు వివరించాడు. సహాయకుడు చెప్పిన మాటలను బట్టి చూస్తే సుశాంత్ ది హత్యే అని అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి.