జ్యోతికను సపోర్ట్ చేస్తూ సూర్య ప్రెస్ నోట్

by Jakkula Samataha |
జ్యోతికను సపోర్ట్ చేస్తూ సూర్య ప్రెస్ నోట్
X

సూపర్ స్టార్ సూర్య సతీమణి జ్యోతిక ఓ అవార్డ్ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు వివాదానికి దారితీసాయి. తంజావూర్ లో షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఓ హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చిందని… కానీ అక్కడ పేషెంట్లకు అందే సేవలు చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పింది. హాస్పిటల్ శుభ్రత చాలా ఘోరంగా ఉందని కూడా చెప్పింది. తంజావూర్ దేవాలయాన్ని ఒక ప్యాలస్ మాదిరిగా చూస్తున్నప్పుడు… స్కూల్స్, హాస్పిటల్స్ ను ఎందుకు అలా శుభ్రంగా ఉంచలేకపోతున్నం అని ప్రశ్నించింది. దీంతో దేవాలయాల గురించి మాట్లాడిన జ్యోతిక … మసీదులు, చర్చ్ ల గురించి మాట్లాడగలదా అంటూ వివాదానికి తెర తీశారు నెటిజన్లు. ఇండస్ట్రీలో కూడా కొందరు తనను సపోర్ట్ చేయగా మరి కొందరు వ్యతిరేకించారు.

ఇదిలా ఉండగా సూర్య తన భార్యను సపోర్ట్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. మానవత్వం ముందు మతం పనికి రాదని చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి దానిలో నెగటివ్ చూడకుండా… పాజిటివ్ గా చూడాలని తెలిపాడు.హాస్పిటల్స్, స్కూల్స్ ను కూడా దేవాలయాలు గా చూడాలన్న జ్యోతిక ఉద్దేశాన్ని వదిలేసి… మత సంబంధమైన వివాదానికి తెర తీయడం సమంజసం కాదన్నారు సూర్య. ఇతరులకు సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేయడం అన్న వివేకానంద మాటలు కొందరు గ్రహించలేక పోతున్నారని… కొందరు మంచి మాటలు, మంచి కథలు వినడానికి అసలు ఆసక్తి చూపరు అనేది అర్థం అవుతుందన్నారు సూర్య.

Tags : Suriya, Jyothika, support, Schools, speech, vivekananda, Controversy

Advertisement

Next Story

Most Viewed