లిక్కర్‌ కింగ్‌కు సుప్రీం అల్టిమేటమ్

by Shamantha N |
లిక్కర్‌ కింగ్‌కు సుప్రీం అల్టిమేటమ్
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు అల్టిమేటమ్ జారీ చేసింది. అక్టోబర్‌ 5న మధ్యాహ్నం 2గంటలకు కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని సోమవారం స్పష్టం చేసింది. బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయారు. 2016 నుంచి బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాకు స్కాట్‌లాండ్ కోర్టు 2017 ఏప్రిల్ 18న బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి మాల్యాను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ మాల్యాకు ఆశ్రయం ఇవ్వొద్దని కేంద్ర విదేశాంగ శాఖ జూన్11న బ్రిటన్‌ కోర్టును కోరగా… అప్పగించే చర్యలపై బ్రిటన్ చర్యలు చేపట్టింది. తన పిల్లల బ్యాంక్ ఖాతాలో 40మిలియిన్ అమెరికా డాలర్లు బదిలీ చేసిన విజయ్ మాల్యా.. కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Advertisement

Next Story