- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ. 4 లక్షల పరిహారం’పై సుప్రీం తీర్పు రిజర్వ్
by Shamantha N |

X
న్యూఢిల్లీ: కరోనాతో మరణించినవారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా, సీనియర్ అడ్వకేట్ ఎస్‌బీ ఉపాధ్యాయ్‌లు సహా ఇతర న్యాయవాదులు రెండున్నర గంటలపాటు వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎంఆర్ షాలతో కూడిన ఓ వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ విచారిస్తున్నది. పిటిషన్‌కు సంబంధించి అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను మూడు రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో పరిహారం చెల్లించే కంటే కరోనా కట్టడికే ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story