- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అరచేతిలో ‘సుప్రీం’ ఆదేశాలు
by Shamantha N |

X
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలు, కేసులు, సర్క్యూలర్లు, రూల్స్, డిస్‌ప్లే బోర్డు, లేటెస్టు అప్‌డేట్ వివరాలను ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో ఉంచే యాప్‌ను కోర్టు విడుదల చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ‘సుప్రీంకోర్టు యాప్’ను శనివారం విడుదల చేశారు. హిందీ, మరాఠి, తెలుగు, కన్నడ, తమిళం, ఇంగ్లీష్‌లలో ఈ వివరాలు ఐఫోన్, ఐపాడ్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఉచితగా పొందవచ్చు. అవసరమున్న వివరాలు నోటిఫికేషన్లు మాత్రమే పొందే వెసులుబాటు, తమ అభీష్టం మేరకు కేసులను అనుసరించే వీలు ఈ యాప్‌లో ఉంటుందని ఓ ప్రకటన తెలిపింది.
Next Story