- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ : నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్భయ కేసులోని నలుగురు దోషుల ఉరితీత షెడ్యూల్‌కు ఒక రోజు ముందు ఈ తీర్పు వెలువడింది. ఈ కేసులోని ముగ్గురు దోషులు ఇప్పటికే క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసి తిరస్కరణకు గురైన విషయం విదితమే. క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత తర్వాత.. ఇప్పుడు పవన్ గుప్తా.. క్షమాభిక్ష పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మిగిలిన ముగ్గురు దోషులు ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్‌లు ఇదివరకే క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇందులో ఇద్దరు ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మలు క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. అక్షయ్ కుమార్ ఇప్పటికైతే క్షమాభిక్ష తిరస్కరణపై కోర్టును ఆశ్రయించలేదు. అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉండటం, దోషులను వేర్వేరుగా ఉరితీసే పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేయడం వంటి కారణాలు.. రేపు వీరి ఉరిశిక్ష అమలుకు అడ్డంకిగా తోస్తున్నాయి.