దయచేసి బయటకు రాకండి.. సూపర్ స్టార్ రిక్వెస్ట్

by Anukaran |
Mahesh Babu, Smart Police Station
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడంతో మరణాల సంఖ్య కూడా జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జనాలకు అవగాహన కల్పించేందుకు సినీ, క్రికెటర్లు అనేకమంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సోనుసూద్ వంటి వాళ్లు వాళ్ల వాళ్ల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. కరోనా బారినుండి అప్రమత్తంగా ఉండాలని త‌న అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కరోనా క‌రాళ నృత్యం చేస్తోన్న వేళ‌.. ‘తప్పనిసరైతేనే బయటకు రండి. అనవసరంగా బయటకు రావొద్దు. జాగ్రత్తలు తప్పక పాటించండి’ అంటూ ట్విటర్‌ వేదికగా మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed