సూపర్‌స్టార్‌ @11 మిలియన్ల అభిమానం

by Shyam |
సూపర్‌స్టార్‌ @11 మిలియన్ల అభిమానం
X

దిశ, వెబ్‌డెస్క్ : ట్విట్టర్ ఫాలోవర్స్ పరంగా అరుదైన ఫీట్ సాధించిన దక్షిణాది తారల్లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు టాప్‌లో నిలిచారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీ, సినిమా విశేషాలే కాకుండా సామజిక అంశాలపై కూడా స్పందించే మహేశ్‌ను సోష‌ల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో జులై వరకు మహేశ్ కోటిమంది ట్విట్టర్ ఫాలోవర్స్‌‌ను కలిగిఉండగా, ఇప్పుడు ఆ అభిమానం 11 మిలియ‌న్‌కు చేరుకుంది. దీంతో ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరో‌గా మహేశ్ తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసినట్టయింది. ఈ రికార్డ్‌తో ఖుషీలో ఉన్న సూపర్‌స్టార్ ఫ్యాన్స్.. 11 మిలియన్ మహేశియన్స్ (#11millionmaheshians )అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియా‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ‘స‌ర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

Next Story