ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

by Shyam |   ( Updated:2021-05-04 06:09:13.0  )
ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో వాతావరణంలో విచిత్ర మార్పులు వచ్చాయి. నిండు వేసవిలో అకాల వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతూనే మరోవైపు గాలివానలు విరుచుకుపడుతున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఈ వర్షాలు జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. దక్షిణ మహా‌రాష్ట్ర పరి‌స‌రాల్లో సముద్రమట్టానికి 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వద్ద ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని‌చోట్ల 30 నుంచి 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులు వీయవచ్చని సూచించింది.

కాగా క్యుములో నింబస్ మేఘాల వల్ల ఆదివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నప్పటికీ గాలి, దుమ్ముతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. సోమ, మంగళవారాల్లో వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. అలాగే జిల్లాల్లోనూ ఈదురుగాలులతో వాన రావడంతో ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి తోటల్లో కాయ నేల రాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Advertisement

Next Story