- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సోమాలియాలో ఆగని ఆత్మాహుతి దాడులు
by vinod kumar |

X
దిశ, వెబ్‌డెస్క్: సోమాలియా దేశాన్ని ఆత్మాహుతి దాడులు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఈ దేశంలోనే అత్యధికంగా ఆత్మహుతి దాడులు జరుగుతుండడం ఆందోళనకరం. ఇప్పటికే జరిగిన దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు వదిలారు. ఓ సారి సోమాలియా రాజధాని మొగదిషులో కారు బాంబు దుర్ఘటన 90 మందిని పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.
ఇటువంటి పరిణామాల మధ్య తాజాగా మొగాదిషు సైనిక స్థావరంలో మరో ఆత్మహుతి దాడి కలకలం రేపింది. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ దాడి ఎవరు చేశారో ఇంకా ప్రటకన రాలేదు. ఉగ్రవాదుల చేస్తున్న నిత్య దాడులతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. తాజా దాడితో సోమాలియా ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.
Next Story