- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్రిస్మస్ వేడుకల్లో ఘోర విషాదం.. ఆరుగురు మృతి
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : క్రిస్మస్ వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ కాంగోలో జరిగింది. వివరాల ప్రకారం.. సెంట్రల్ ఆఫ్రికా కాంగోలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆత్మాహుతి దాడి జరిగింది.
ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర కివు ప్రాంతం, బెనీ సిటీలోని ఓ బార్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు అధికారి వెల్లడించారు. అనంతరం కాల్పులు కూడా జరిగినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్నది బహిర్గతం కావాల్సి ఉంది.
Next Story